ఒకే ఒక్క రీల్ తో గ్లోబల్ రికార్డు!
ఒక లగ్జరీ హోటల్ బ్రాండ్‌తో చేసిన పెయిడ్ కొలాబరేషన్‌లో భాగంగా, దీపికా ఇటీవల షేర్ చేసిన రీల్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం ఎనిమిది వారాల్లో ఈ రీల్ అబ్బురపరిచే 1.9 బిలియన్ వ్యూస్ సాధించింది.;
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మరోసారి తన అసమానమైన గ్లోబల్ ఆకర్షణ ఏంటో నిరూపించింది. ఇప్పటికే ఆమె భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే నటిగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరో రికార్డును నెలకొల్పింది. అది కూడా సినిమాతో కాదు. ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో.
ఒక లగ్జరీ హోటల్ బ్రాండ్‌తో చేసిన పెయిడ్ కొలాబరేషన్‌లో భాగంగా, దీపికా ఇటీవల షేర్ చేసిన రీల్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం ఎనిమిది వారాల్లో ఈ రీల్ అబ్బురపరిచే 1.9 బిలియన్ వ్యూస్ సాధించింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా నిలిచే అవకాశం ఉంది. ఆమె అభిమానులు కామెంట్స్ సెక్షన్‌లో ఆశ్చర్యంతో మునిగిపోయారు.
దీపికా పదుకొణె ఒక ప్రమోషనల్ రీల్‌ను గ్లోబల్ డిజిటల్ సంచలనంగా మార్చగలిగింది. అందుకే ఆమె సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం భారీ పారితోషికం అందుకుంటోంది.
దీపికా పదుకొణె తన తొలి తెలుగు చిత్రం “కల్కి 2898 ఏడీ”తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తోంది. ఇది ఆమె రెండో తెలుగు సినిమా. ఈ చిత్రం కోసం ఆమె ఏకంగా 25 కోట్ల రూపాయల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా అందుకుంటున్నట్లు సమాచారం.