మలయాళం డైరెక్టర్ తో సల్మాన్ సినిమా?
తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ టాలెంటెడ్ మలయాళ దర్శకుడు, ఎడిటర్ మహేష్ నారాయణన్‌తో ఒక పీరియడ్ థ్రిల్లర్ కోసం చర్చలు జరుపుతున్నాడు.;
‘సికందర్’ విఫలమైన తర్వాత.. సల్మాన్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే సినిమాను దర్శకుడు అపూర్వ లఖియాతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే, అపూర్వ లఖియాకు గతంలో ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. అయినప్పటికీ, సల్మాన్ ఈ యుద్ధ నేపథ్య చిత్రాన్ని అతడికి అప్పగించాడు. షూటింగ్ ప్రారంభించే ముందు, సల్మాన్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఖరారు చేయడానికి పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ టాలెంటెడ్ మలయాళ దర్శకుడు, ఎడిటర్ మహేష్ నారాయణన్‌తో ఒక పీరియడ్ థ్రిల్లర్ కోసం చర్చలు జరుపుతున్నాడు. మహేష్ నారాయణన్ అనగా, ‘టేక్ ఆఫ్’, ‘అరియిప్పు’ వంటి అవార్డు గెలుచుకున్న చిత్రాల దర్శకుడు. మహేష్ సల్మాన్‌తో బోలెడు ఆలోచనలు పంచుకున్నాడని.. అందులో 1970 నుంచి 1990ల మధ్య కాలంలో నడిచే.. యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఒక పీరియడ్ థ్రిల్లర్ సల్మాన్ ఆసక్తిని రేకెత్తించిందని సమాచారం.
సల్మాన్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, నటుడిగా సవాళ్లు స్వీకరించే కొత్త జోనర్‌లను అన్వేషించాలని చూస్తున్నాడట. మహేష్ నారాయణన్‌కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ ప్రాజెక్ట్ 2026లో సెట్స్‌పైకి వెళ్లనుంది.