తెలుగు నిర్మాత మలయాళ చిత్రం !
‘జయ జయ జయ జయ హే’ గత ఏడాది ‘గురువాయూరంబలనడయిల్’ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు విపిన్ దాస్, తెలుగు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.;
‘రేఖాచిత్రం’ మూవీతో తెలుగువారికి బాగా సుపరిచితురాలైంది మల్లూ బ్యూటీ అనస్వరా రాజన్. ఆమె మెయిన్ లీడ్ లో .. తెలుగు నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్న ‘వ్యసనసమేతం బంధుమిత్రాదికల్’ సినిమా జూన్ 13న థియేటర్లలో విడుదల కానుందని తాజాగా టీజర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం ఒక ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. దీన్ని ఎస్. విపిన్ రాసి.. డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమాలో సిజు సన్నీ, జోమోన్ జ్యోతిర్, బైజు సంతోష్, అజీస్ నెడుమంగడ్, మల్లిక సుకుమారన్, నోబీ మార్కోస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అంకిత్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు. ‘జయ జయ జయ జయ హే’ గత ఏడాది ‘గురువాయూరంబలనడయిల్’ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు విపిన్ దాస్, తెలుగు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
షైన్ స్క్రీన్ సినిమా, సాహు గరపాటి నేతృత్వంలో భగవంత్ కేసరి, టక్ జగదీష్, మజిలీ, కృష్ణార్జున యుద్ధం, ఉగ్రం వంటి పలు ప్రముఖ తెలుగు చిత్రాల నిర్మాణంలో భాగమైంది. తాజాగా చిరు అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్ ను మొదలు పెట్టింది ఈ సంస్థ. ఇక అనస్వర రాజన్ ఇటీవల ఇంద్రజిత్ సుకుమారన్‌తో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ చిత్రంలో నటించింది. దీపు కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.