వినీత్ శ్రీనివాసన్ థ్రిల్లర్ మూవీ ‘కరం’

ఈ సినిమా వినీత్‌ను 12 ఏళ్ల తర్వాత 'తిర' తరహాలో థ్రిల్లర్ జోనర్‌లోకి తీసుకెళ్తుంది. తాజాగా చిత్ర బృందం 'కరం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.;

By :  K R K
Update: 2025-07-17 01:08 GMT

మాలీవుడ్ క్రేజీ హీరో కమ్ డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ నెక్స్ట్ డైరెక్టోరియల్ మూవీ 'కరం'. నోబుల్ బాబు థామస్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాసి, ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా వినీత్‌ను 12 ఏళ్ల తర్వాత 'తిర' తరహాలో థ్రిల్లర్ జోనర్‌లోకి తీసుకెళ్తుంది. తాజాగా చిత్ర బృందం 'కరం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నోబుల్ బైక్‌పై తుపాకీ పట్టుకుని కనిపిస్తున్నాడు.

నోబుల్ తన సినీ కెరీర్‌ను 'జాకబిండే స్వర్గరాజ్యం, అరవిందండే అతిథికళ్, హెలెన్' లాంటి చిత్రాల నిర్మాణంలో పాల్గొనడం ద్వారా ప్రారంభించాడు. 'హెలెన్' సినిమాకు అతను సహ రచయితగా వ్యవహరించి.. హీరోగా తొలి అడుగు వేశాడు. అలాగే.. 'హృదయం, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, ఫిలిప్స్' లాంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. 'కరం'లో ఆడ్రీ మిరియం, రేష్మా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

మనోజ్ కె. జయన్, కలభవన్ షాజోన్, బాబు రాజ్, విష్ణు జి. వరియర్, జానీ ఆంటోనీ సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం జార్జియా, రష్యా, అజర్‌బైజాన్ సరిహద్దుల్లో విస్తృతంగా చిత్రీకరించబడింది. అలాగే, షిమ్లా, చండీగఢ్, కొచ్చిలో కొంత భాగం షూటింగ్ జరిగింది. షాన్ రెహమాన్ సంగీత దర్శకుడిగా, రంజన్ అబ్రహం ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.వినీత్ నిర్మాణ సంస్థ హాబిట్ ఆఫ్ లైఫ్, విశాక్ సుబ్రమణ్యం మెర్రీల్యాండ్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'కరం' మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ట్రైలర్ ఆగస్టులో రిలీజ్ అవుతుందని వినీత్ ధృవీకరించాడు.

Tags:    

Similar News