పృధ్విరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ ప్రారంభం
షూటింగ్ ఆగస్టులో లండన్‌లో ప్రారంభం కానుంది. పృథ్వీరాజ్ ఈ చిత్రం క్లాప్‌బోర్డ్ ఫోటోను పోస్ట్ చేస్తూ.. “అమీర్ అలీ.. త్వరలో కలుద్దాం..” అని క్యాప్షన్ జోడించారు.;
‘పోకిరి రాజా’ మలయాళ చిత్రం తర్వాత 15 సంవత్సరాల తర్వాత హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు వైశాఖ్.. భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ‘ఖలీఫా’ కోసం మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం తాజాగా కేరళలో జరిగింది. షూటింగ్ ఆగస్టులో లండన్‌లో ప్రారంభం కానుంది. పృథ్వీరాజ్ ఈ చిత్రం క్లాప్‌బోర్డ్ ఫోటోను పోస్ట్ చేస్తూ.. “అమీర్ అలీ.. త్వరలో కలుద్దాం..” అని క్యాప్షన్ జోడించారు.
‘ఖలీఫా’ మూవీ పోస్టర్ 2022 అక్టోబర్‌లో “వెంజెన్స్ విల్ బీ రిట్టెన్ ఇన్ గోల్డ్” అనే క్యాప్షన్‌తో లాంచ్ అయింది. స్క్రిప్ట్ రాయడంతో పాటు, ఈ చిత్ర నిర్మాణాన్ని జిను అబ్రహాం నిర్వహిస్తున్నారు. సంగీతం జేక్స్ బిజోయ్ సమకూర్చుతున్నాడు. జిను అబ్రహాంతో పృథ్వీరాజ్‌కు ఇది మూడో చిత్రం.
వైశాఖ్ ఇటీవల మమ్మూట్టి నటించిన ‘టర్బో’, అంతకు ముందు మోహన్‌లాల్ నటించిన ‘మాన్స్టర్’ చిత్రాలను రూపొందించాడు. అలాగే, ఉదయ్‌కృష్ణ రచనలో ‘బ్రూస్ లీ’ అనే మరో చిత్రం కూడా లిస్ట్ లో ఉంది. పృథ్వీరాజ్ ఇటీవల తన దర్శకత్వ చిత్రం ‘ఎల్ 2: ఎంపురాన్’ లో నటించాడు. అతడి తదుపరి చిత్రం కాజోల్‌తో కలిసి నటిస్తున్న హిందీ వార్ డ్రామా ‘సర్జమీన్’... ప్రస్తుతం సెట్స్ పై ఉంది.