‘డాల్బీ దినేశన్’ గా నివీన్ పాలీ !
ప్రముఖ దర్శకుడు థమర్ కేవి (‘1001 నుణగల్’ ఫేమ్) తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘డాల్బీ దినేశన్’ అనే వెరైటీ టైటిల్ ను ఖరారు చేశారు.;
మాలీవుడ్ క్రేజీ హీరో నివిన్ పాలీ మొన్నా మధ్య బరువు తగ్గిన ఫోటోల్ని షేర్ చేసి అభిమానులకు షాకిచ్చాడు. బాగా సన్నంగా మారిపోయిన నివీన్.. వరుస సినిమాల్ని లైన్ లో పెడుతున్నాడు. తాజాగా నివీన్ పాలీ .. తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అలాగే.. ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ప్రముఖ దర్శకుడు థమర్ కేవి (‘1001 నుణగల్’ ఫేమ్) తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘డాల్బీ దినేశన్’ అనే వెరైటీ టైటిల్ ను ఖరారు చేశారు.
విషు పర్వదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా నివిన్ ఈ మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ... "దినేశా.. ఓ రైడ్ కి వెళ్దామా?" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. పోస్టర్‌లో నివిన్ ఒక ఆటో రిక్షా పక్కన నిలబడి ఉన్నాడు. ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించి, చెవిలో హెడ్‌సెట్ పెట్టుకున్న తీరు చూస్తే.. సంగీతం పట్ల మక్కువ ఉన్న ఆటోడ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది.
ఈ చిత్రాన్ని వినాయక అజిత్ తన స్వీయ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చిత్రానికి సంగీతం డాన్ విన్సెంట్ అందించగా, సినిమాటోగ్రఫీ జితిన్ స్టానిస్లాస్ మరియు ఎడిటింగ్ నిధిన్ రాజ్ అరుల్ చేశారు. 'యానిమల్' వంటి బాలీవుడ్ ప్రాజెక్టులకు పని చేసిన 'సింక్ సినిమా' ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ అందిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మే మధ్యలో ప్రారంభమవనుండగా... 2025లో విడుదల చేసే ఉద్దేశంతో టీం ముందుకెళ్తోంది.
ఇక నివిన్ పాలీ ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే... 'యాక్షన్ హీరో బిజు' సీక్వెల్ లోనూ, నయనతారతో కలిసి ‘డియర్ స్టూడెంట్స్’, అలాగే భారతదేశపు తొలి మల్టీవర్స్ సూపర్‌హీరో చిత్రం ‘మల్టీవర్స్ మన్మధన్’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో.. నివిన్ పాలీ మరోసారి విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడని మేకర్స్ చెబుతున్నారు. మరి డాల్బీ దినేశన్ గా నివీన్ పాలీ ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.