జోషి దర్శకత్వంలో ఉన్ని ముకుందన్ !

ప్రముఖ సీనియర్ దర్శకుడు జోషితో కలిసి ఓ "యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా" కోసం ఉన్ని ముకుందన్ జత కడుతున్నాడు.;

By :  K R K
Update: 2025-07-18 12:54 GMT

‘మార్కో’ సినిమాతో సంపాదించిన యాక్షన్ హీరో ఇమేజ్‌ను మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నాడు మాలీవుడ్ యంగ్ హీరో ఉన్ని ముకుందన్. ఇప్పుడు ప్రముఖ సీనియర్ దర్శకుడు జోషితో కలిసి ఓ "యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా" కోసం జతకడుతున్నాడు. ఈ ప్రకటన తాజాగా జోషి పుట్టినరోజు సందర్భంగా వెలువడింది. ఈ చిత్రాన్ని ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్, ఐన్‌స్టిన్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇది ఉన్ని ముకుందన్, జోషి కాంబోలో తొలి చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జోషి అనేక ప్రశంసనీయ మాస్ ఎంటర్‌టైనర్‌లకు దర్శకత్వం వహించిన సుపరిచితుడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త చిత్రంలో ఉన్ని ఇప్పటివరకూ చూడని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను అభిలాష్ ఎన్ చంద్రన్ రాసాడు. ఇతను గతంలో జోషి దర్శకత్వం వహించిన ‘పోరింజు మరియం జోస్’, అతని కుమారుడు అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ చిత్రాలకు స్క్రిప్ట్ రాశాడు.

ఇక డైరెక్టర్ జోషి చివరిగా జోజు జార్జ్‌తో ‘ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఉన్ని చివరి చిత్రం ‘గెట్-సెట్ బేబీ’. ఇందులో అతను పురుష స్త్రీ జనన శాస్త్రవేత్త పాత్రలో నటించాడు. అయితే.. ఉన్ని మార్కో సీక్వెల్‌ను ప్రకటించినప్పటికీ.. దాని చుట్టూ ఉన్న "నెగెటివిటీ" కారణంగా ఇటీవల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. మరి జోషి .. ఉన్నీ ముకుందన్ తో ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడో చూడాలి.

Tags:    

Similar News