దిలీప్ ‘భభబ’ చిత్రం అప్డేట్ వచ్చేది అప్పుడే !
దిలీప్ జులై 04న ‘భభబ’ గురించి ఒక పెద్ద అప్‌డేట్ ఉంటుందని అనౌన్స్ చేశారు. జులై 04ను దిలీప్ తన అదృష్ట రోజుగా భావిస్తారు. ఎందుకంటే ‘ఈ పరక్కుం తళిక, సీఐడీ మూస, పాండిప్పడ’ వంటి హిట్ చిత్రాలు ఆ రోజున విడుదలయ్యాయి.;
లేటెస్ట్ గా మలయాళ జనప్రియ నాయకుడు దిలీప్ తన రాబోయే చిత్రం ‘భభబ’ (భయం భక్తి బహుమానం) సినిమా సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో దిలీప్ కాషాయ రంగు షర్ట్‌లో పెద్ద చిరునవ్వుతో కనిపించారు. ధనంజయ్ శంకర్ దర్శకత్వంలో, నూరిన్ షరీఫ్ , మధురం ఫేమ్ ఫహీమ్ సఫర్ రాసిన స్క్రీన్‌ప్లేతో.. గోకులం గోపాలన్ తన బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక 'క్రేజీ' ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, బాలు వర్గీస్, సరన్య పొన్వన్నన్, సిద్ధార్థ్ భరతన్, బైజు సంతోష్, అశోకన్, మణియన్‌పిళ్ల రాజు తదితరులు నటిస్తున్నారు. పోస్టర్‌ను షేర్ చేస్తూ.. దిలీప్ జులై 04న ‘భభబ’ గురించి ఒక పెద్ద అప్‌డేట్ ఉంటుందని అనౌన్స్ చేశారు. జులై 04ను దిలీప్ తన అదృష్ట రోజుగా భావిస్తారు. ఎందుకంటే ‘ఈ పరక్కుం తళిక, సీఐడీ మూస, పాండిప్పడ’ వంటి హిట్ చిత్రాలు ఆ రోజున విడుదలయ్యాయి. ఆయన నటించిన ఒక చిత్రం ‘జులై 4’ అనే టైటిల్‌తో కూడా ఉంది. అయితే అది ఒక రోజు తర్వాత విడుదలైంది.
‘భభబ’ చిత్రం రెడిన్ కింగ్స్ లీ, సాండీల మలయాళ ఎంట్రీ కాబోతోంది. ఇటీవల.. దిలీప్ ఈ చిత్రంలో మోహన్‌లాల్ కనిపిస్తారనే విషయాన్ని డిక్లేర్ చేశారు. ఆయన కామియో రోల్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ‘ప్రిన్స్ అండ్ ద ఫ్యామిలీ’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న దిలీప్ ‘భభబ’ చిత్రంతో ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.