‘మొదటి చినుకు’ మెలోడీ హిట్!

యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది.;

By :  S D R
Update: 2025-03-21 01:35 GMT

యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. లేటెస్ట్ గా ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ప్రమోషన్‌లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రాగా.. లేటెస్ట్‌గా థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు.

‘మొదటి చినుకు’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. రధన్ సంగీతం అందించిన ఈ మెలోడీకి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం రాశారు. సిద్ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట ప్రదీప్-దీపికల ఆనందకరమైన కెమిస్ట్రీతో ఆకట్టుకుంటుంది. కొరియోగ్రాఫర్ విశ్వ రఘు అందమైన డ్యాన్స్ మూమెంట్స్ ద్వారా ఈ ట్రాక్‌ను మరింత హైలైట్ చేశారు.

మాంక్స్ & మంకీస్ బ్యానర్ లో యంగ్ డైరెక్టర్లు నితిన్, భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది. మరి.. ఈ వేసవిలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఒక మెమరబుల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.


Full View


Tags:    

Similar News