'వీరమల్లు'కి మెగా సెంటిమెంట్?

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాడు. కానీ అతని కెరీర్ లో 'హరిహర వీరమల్లు' చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. పవన్ నటించిన తొలి చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది కాగా.. ఈ చిత్రం అతని కెరీర్ లోనే ఎక్కువ ఏళ్ల పాటు చిత్రీకరణలో ఉన్న సినిమా కూడా.;

By :  S D R
Update: 2025-06-20 16:05 GMT

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాడు. కానీ అతని కెరీర్ లో 'హరిహర వీరమల్లు' చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. పవన్ నటించిన తొలి చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది కాగా.. ఈ చిత్రం అతని కెరీర్ లోనే ఎక్కువ ఏళ్ల పాటు చిత్రీకరణలో ఉన్న సినిమా కూడా. ఇక ఇప్పటికే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత ఇప్పుడు కొత్త తేదీ ఖరారు చేసుకోబోతుంది.

గతంలో మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన మే 9న 'హరిహర వీరమల్లు'ని విడుదల చేద్దామనుకున్నారు. ఆ తర్వాత జూన్ 12న రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అది కూడా పోస్ట్‌పోన్. ఇప్పుడు ఈ చిత్రం జూలై 24న రాబోతున్నట్టు తెలుస్తోంది.

జూలై 24 డేట్‌కి ఒక మెగా సెంటిమెంట్ ఉంది. ఇప్పుడదే 'హరిహర వీరమల్లు'కు సపోర్ట్‌గా నిలవబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ డేట్ ప్రత్యేకత ఏమిటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తొలిసారి అతిపెద్ద విజయాన్ని అందించిన చిత్రం 'తొలిప్రేమ'. ఈ సినిమాతో పవన్ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 1998, జూలై 24న 'తొలిప్రేమ' విడుదలైన రోజు. ఇప్పుడు అదే జూలై 24న 'హరహర వీరమల్లు'ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ 'ఇంద్ర' విడుదలైన తేదీ కూడా జూలై 24 కావడం విశేషం. 'తొలిప్రేమ' వచ్చిన నాలుగేళ్లకు 2002, జూలై 24న 'ఇంద్ర' చిత్రం విడుదలైంది. చిరు 'ఇంద్ర' ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులు కొల్లగొట్టిందో తెలిసిందే. మొత్తంగా.. 'హరిహర వీరమల్లు' ఇప్పుడు మెగా సెంటిమెంట్ డేట్ అయిన జూలై 24నే అనౌన్స్‌ అవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News