‘మెగా 157’ హాఫ్ కంప్లీట్!
హిట్‌మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 157’ ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.;
హిట్‌మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 157’ ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే.. సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో తెలిపాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే 'మెగా 157' ఫస్టాఫ్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. సెకండాఫ్ కు సంబంధించి షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నట్టు హింట్ ఇచ్చాడు.
మరోవైపు ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్ గా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫమ్ చేశాడు. తాను కూడా చిరు బర్త్‌డే కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ఆ ఇంటర్యూలో తెలిపాడు అనిల్ రావిపూడి.
ఇక 'మెగా 157'లో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో వెంకీ ఓ పోలీసు ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. చిరుకి జోడీగా నయనతార నటిస్తుండగా.. కీలక పాత్రలో కేథరిన్ కనిపించబోతుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది.