ఫిల్మ్ ఛాంబర్‌లో వేడెక్కిన చర్చలు

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు, ఛాంబర్ ప్రతినిధుల మధ్య మేధో మదనం జరుగుతుంది.;

By :  S D R
Update: 2025-08-13 12:00 GMT

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు, ఛాంబర్ ప్రతినిధుల మధ్య మేధో మదనం జరుగుతుంది.

సమావేశంలో కొన్ని ప్రతిపాదనలపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ముఖ్యంగా మూడు యూనియన్లకు వేతనాల్లో పర్సంటేజ్ పెంపు సాధ్యం కాదని నిర్మాతలు స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ధృవీకరించారు.

చర్చలు ఒక దశలో వాడి వేడిగా మారినా, చివరికి కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నందున త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలనే అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యక్తం చేశారు. మరోవైపు, ఫెడరేషన్ నాయకులు ముందుగా వేతనాలు పెంచాలని, తరువాత దశలవారీగా నిర్మాతల ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్ధమని తెలిపినట్లు సమాచారం. ఇక ఈ చర్చల ఫలితం ఏంటి? సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్నలకు సమాధానం కోసం సినీ పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News