పవన్ బర్త్‌డే కి డబుల్ ధమాకా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ మూవీస్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పవర్ స్టార్ సూపర్ హిట్ మూవీస్ ను ఒక్కొక్కటిగా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.;

By :  S D R
Update: 2025-08-14 02:42 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ మూవీస్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పవర్ స్టార్ సూపర్ హిట్ మూవీస్ ను ఒక్కొక్కటిగా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ రెడీ అవుతుంది.

ఇప్పటికే పవన్ బర్త్‌డే స్పెషల్ గా సూపర్ హిట్ మూవీ 'తమ్ముడు' రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పుడు మరో సూపర్ హిట్ 'జల్సా' కూడా పవర్‌స్టార్ బర్త్ డే స్పెషల్ గా గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ కు సిద్ధమవుతుంది.

'జల్సా' చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ‘ఖుషి’ తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూసిన పవన్ కు 'జల్సా' సినిమా ఆ లోటును తీర్చింది. యూత్‌ఫుల్ ఫుల్ స్టోరీ, త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అన్నీ కలిసి 'జల్సా'ని బాక్సాఫీస్ వద్ద బడా హిట్ గా నిలిపాయి.

‘జల్సా’ చిత్రాన్ని గతంలోనూ రీ రిలీజ్ చేయగా.. అప్పట్లోనే రూ.3 కోట్లు వసూళ్లు సాధించాయి. మొత్తంగా సెప్టెంబర్ 2న థియేటర్లలోకి వస్తున్న ‘జల్సా’ పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలకు పర్ఫెక్ట్ మాస్-ఫ్యాన్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మరి.. 'తమ్ముడు, జల్సా' రెండు చిత్రాలూ సెప్టెంబర్ 2న థియేటర్లలో ఎలాంటి సందడి సృష్టిస్తాయో చూడాలి.

Tags:    

Similar News