నితిన్ - విక్రమ్ కాంబో మూవీ లాంచింగ్ అప్పుడే !

ఈ మూవీ త్వరలోనే స్టార్ట్ కానుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న స్ట్రైక్ క్లియర్ అయిన తర్వాత, ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది.;

By :  K R K
Update: 2025-08-14 03:38 GMT

హీరో నితిన్.. ఇటీవల కొన్ని ఫ్లాప్‌లతో కెరీర్‌లో డల్ ఫేస్‌లో ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ తన ట్రస్టెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో టీమప్ అయి కంఫర్ట్ జోన్‌కి రిటర్న్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. 2012లో నితిన్ కెరీర్ డౌన్‌లో ఉన్నప్పుడు, విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ “ఇష్క్” అతడిని ట్రాక్‌లోకి తెచ్చింది.

ఆ తర్వాత ‘గుండె జారి గల్లంతయ్యిందె, ఆ..ఆ.., భీష్మ’ లాంటి హిట్‌లు కొట్టాడు. ఇప్పుడు మళ్లీ కెరీర్‌లో స్లో ఫేస్‌లో ఉన్న నితిన్... విక్రమ్ కుమార్‌తో మళ్ళీ జోడీ కట్టడంపై ఆశలు పెట్టుకున్నాడు. విక్రమ్ కూడా కూల్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తూ.. నితిన్‌కి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడని టాక్.

ఈ మూవీ త్వరలోనే స్టార్ట్ కానుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న స్ట్రైక్ క్లియర్ అయిన తర్వాత, ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. నాగచైతన్యతో ‘దూత’ వెబ్ సిరీస్ తర్వాత విక్రమ్ మరో ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు. మరి నితిన్ తో విక్రమ్ ఏ రేంజ్ సినిమా తీస్తాడో చూడాలి.

Tags:    

Similar News