ఆకట్టుకుంటున్న ‘త్రిబాణదారి బార్బరిక్‘ ట్రైలర్
సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‘.;
సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‘. మైథలాజికల్ థ్రిల్లర్ గా మోహన్ శ్రీ వత్స దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ఈ చిత్రాన్ని పురాణాలలోని భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడైన బార్బరిక్ నేపథ్యంలో రూపొందించారు. మైథలాజీకి మోడర్న్ కాలంతో లింక్ పెడుతూ ఈ సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు. నేటి యువత, చెడు అలవాట్లు, కిడ్నాపులు వంటి అంశాలతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం అందించిన ఈ సినిమాను విజయ్‌పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. ఆగస్టు 22న ‘త్రిబాణధారి బార్బరిక్‘ విడుదలకు ముస్తాబవుతుంది.