‘కూలీ‘ మూవీ హైలైట్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’.;

By :  S D R
Update: 2025-08-13 11:26 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. మరికొద్ది గంటల్లో ‘కూలీ‘ వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ చిత్రం హైలైట్స్ ఓసారి చూద్దాం.

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన స్టైల్ మాస్ స్క్రీన్ ప్లే, ట్విస్టులతో ఈ చిత్రాన్ని మలిచాడట. ‘కూలీ’ కథ గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ కథను మాస్, క్లాస్ ఆడియెన్స్ ఇద్దరికీ కనెక్ట్ అయ్యేలా మలిచాడట. ఇందులో రజనీకాంత్ పాత్రలో స్టైలిష్ యాక్షన్, మాస్ డైలాగ్స్, ఎమోషనల్ టచ్ కలగలిపి ఉంటాయని టీమ్ చెబుతోంది. హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రఫీతో, భారీ సెట్‌లలో రూపొందించిన ఫైట్లు ‘కూలీ‘కి మరో హైలైట్ అంటున్నారు.

ఈ సినిమాలో కింగ్ నాగార్జున పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించడం విశేషం. నాగార్జున తన కెరీర్ లో తొలిసారి ఓ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించబోతుడటం ఇదే తొలిసారి. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనువిందు చేయబోతున్నాడు. ఇంకా కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళీ స్టార్ సౌబిన్ షాహిర్ లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

శ్రుతి హాసన్, సత్యరాజ్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా అనేకంటే ఒక క్యారెక్టర్ అంటేనే బాగుంటుందేమో. టెక్నికల్ గా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పూజా హెగ్డే చేసిన ‘మోనిక‘ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో, రిచ్ విజువల్స్, టాప్ క్లాస్ CG వర్క్ తో సినిమా నిర్మించడం విశేషం.

‘కూలీ’ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది. ఈ క్రాస్-ఇండస్ట్రీ స్టార్ కాస్టింగ్, భారీ ప్రమోషన్ల కారణంగా సినిమా ఓపెనింగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ టాక్. మొత్తంగా.. ‘కూలీ‘ ఫైనల్ రివ్యూ మరికొద్ది గంటల్లో రానుంది.

Tags:    

Similar News