'కుబేర' క్రేజీ డీల్!

టాలీవుడ్‌ నుంచి పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో 'కుబేర' ఒకటి. కోలీవుడ్ స్టార్ ధనుష్ టైటిల్ రోల్ లో, కింగ్ నాగార్జున, రష్మిక ఇతర ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-05-17 03:00 GMT

టాలీవుడ్‌ నుంచి పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో 'కుబేర' ఒకటి. కోలీవుడ్ స్టార్ ధనుష్ టైటిల్ రోల్ లో, కింగ్ నాగార్జున, రష్మిక ఇతర ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శేఖర్ కమ్ముల, ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ఆలోచిస్తూ అద్భుతమైన తారాగణంతో ముందుకు వస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శేఖర్ కమ్ముల గత సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం హై బడ్జెట్, భారీ సెట్స్, స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘కుబేర’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దాదాపు రూ. 50 కోట్లుకి విక్రయించినట్టు తెలుస్తోంది. ఇది శేఖర్ కమ్ముల కెరీర్‌లోనే అత్యధిక ఓటీటీ డీల్. ఈ డీల్ తర్వాత ఈ సినిమాపై మార్కెట్‌లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని భావిస్తున్నారు మేకర్స్. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. జూన్ 20న ‘కుబేర’ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Tags:    

Similar News