సరోజా దేవి మృతి పట్ల పవన్ సంతాపం
అలనాటి అగ్ర కథానాయికలలో అందాల అభినేత్రి బి.సరోజాదేవి ది ప్రత్యేక స్థానం.;
అలనాటి అగ్ర కథానాయికలలో అందాల అభినేత్రి బి.సరోజాదేవి ది ప్రత్యేక స్థానం. తన నటనా జీవితంలో ఎంతో మంది మహానటులతో కలసి నటించి, గొప్ప పాత్రల ద్వారా మహిళా పాత్రలకు గౌరవం తీసుకొచ్చిన ఈ మేటి నటి ఇక మన మధ్య లేకపోవడం తెలుగు సినీ లోకానికి తీరని లోటు అని పలువురు సెలబ్రిటీలు ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
బి.సరోజా దేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపాన్ని ప్రకటించి సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని అందించారు. ‘దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక వెలుగు, అభినయానికి చిరునామా, పద్మభూషణ్ శ్రీమతి బి. సరోజా దేవి గారు మరణించిన వార్త నన్నెంతో కలచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.‘ అని తెలిపారు పవన్ కళ్యాణ్.
‘1955లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన సరోజాదేవి గారు దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్రనటిగా వెలిగారు. తను నటించిన ‘భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం‘ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. అని పవన్ కళ్యాణ్ అన్నారు.