ముచ్చటగా మూడు సీక్వెల్స్
ప్రస్తుతం తేజ సజ్జా రాబోయే సినిమాల గురించి చర్చ జరుగుతోంది. అతను ముచ్చటగా మూడు ఫ్రాంచైజీ సినిమాల సీక్వెల్స్‌లో నటించనున్నాడు.;
సెన్సేషనల్ యంగ్ హీరో తేజ సజ్జా వరుసగా రెండు బ్లాక్‌బస్టర్‌లు 'హనుమాన్', 'మిరాయ్'తో అదరగొట్టాడు. 'హనుమాన్' ఘనవిజయం తర్వాత ఆతృతగా సినిమాలు సైన్ చేయకుండా.. బాగా సమయం తీసుకుని 'మిరాయ్' కోసం పూర్తిగా అంకితం అయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం నెల రోజులకు పైగా శ్రమించాడు. అతని కఠోర శ్రమ, అదృష్టం ఫలించి ఈ విజయాలు సొంతం అయ్యాయి.
ప్రస్తుతం తేజ సజ్జా రాబోయే సినిమాల గురించి చర్చ జరుగుతోంది. అతను ముచ్చటగా మూడు ఫ్రాంచైజీ సినిమాల సీక్వెల్స్‌లో నటించనున్నాడు. ఈ ఏడాది 'జాంబీ రెడ్డీ 2' షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రశాంత్ వర్మ 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్'పై పని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ చిత్రంలో లార్డ్ హనుమాన్ పాత్ర కోసం ఒక ప్రముఖ నటుడు ఎంపిక కానున్నాడు.
ఇవి కాకుండా.. ఇంకా 'మిరాయ్ 2' కూడా అనౌన్స్ అయింది. ప్రస్తుతానికి తేజ సజ్జా కొత్త సినిమాలు టేకప్ చేయాల్సిన అవసరం లేదు. తన విజయవంతమైన ఫ్రాంచైజీ సీక్వెల్స్‌తోనే కొనసాగవచ్చు. ఈ మూడు సీక్వెల్స్ కూడా భారీ విజువల్ స్పెక్టాక్యులర్స్ గా రూపొందబోతున్నాయి.