నయా ట్రెండ్.. ఏఐలో హీరోల కటౌట్స్

సినీ ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తూనే ఉంటారు. సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి బెనిఫిట్ షోలు, థియేటర్ల ముందు కటౌట్స్, ఫ్లెక్సీలు, పాలు పోసే వేడుకలు అన్నీ సాధారణమే.;

By :  S D R
Update: 2025-09-14 09:57 GMT


Delete Edit

సినీ ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తూనే ఉంటారు. సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి బెనిఫిట్ షోలు, థియేటర్ల ముందు కటౌట్స్, ఫ్లెక్సీలు, పాలు పోసే వేడుకలు అన్నీ సాధారణమే. కానీ ఇప్పుడు టెక్నాలజీ మార్పుతో, అభిమానుల క్రియేటివిటీకి కొత్త రంగు వచ్చింది. అదే ఏఐ కటౌట్స్ ట్రెండ్.

గతంలో హీరోల పుట్టినరోజులు, సినిమాల రిలీజ్ రోజులు రాగానే ఫ్యాన్స్ భారీ కటౌట్స్ పెట్టేవారు. అయితే వీటికి ఖర్చు ఎక్కువ, సమయం ఎక్కువ. పైగా కొన్ని సార్లు అనుమతుల సమస్యలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌తో ఇంట్లో కూర్చునే ఫ్యాన్స్ కూడా 100 ఫీట్లు ఎత్తులో ఉన్నట్టుగా కనిపించే డిజిటల్ కటౌట్స్ సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ తమ ఇష్టమైన హీరో ఫోటోను తీసుకుని AI డిజైన్ టూల్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. కొన్ని నిమిషాల్లోనే హీరోని మైథలాజికల్ పాత్రల్లోనూ, ఫ్యూచరిస్టిక్ గెట్‌అప్స్‌లోనూ, లేదా థియేటర్ ముందు భారీ కటౌట్ స్టైల్లోనూ మార్చేస్తారు. కొందరు అయితే హీరోల పుట్టినరోజుకు డిజిటల్ పాలాభిషేకం కూడా AI సహాయంతోనే చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్లలో కూడా ఈ ట్రెండ్ ఉపయోగపడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రొడక్షన్ హౌసెస్ అధికారికంగా AI కటౌట్స్ రిలీజ్ చేస్తే, ఫ్యాన్స్ మరింత ఎంగేజ్ అవుతారనే అంచనాలు ఉన్నాయి.



Tags:    

Similar News