‘మిరాయ్‘ రెండు రోజుల వసూళ్లు
తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన ‘మిరాయ్’ విడుదలైన రెండో రోజుకి మరింత ఊపందుకుంది.;
By : S D R
Update: 2025-09-14 07:28 GMT
తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన ‘మిరాయ్’ విడుదలైన రెండో రోజుకి మరింత ఊపందుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లు గ్రాస్ రాబట్టగా, రెండో రోజుతోనే రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.
తెలుగులోనే కాదు, హిందీ బెల్ట్‌లోనూ ఈ సినిమా శనివారం మంచి వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.1.65 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు దాదాపు రూ.2.5 కోట్లు రాబట్టి 50% గ్రోత్ చూపింది. ఈ సినిమాకి ఓవర్సీస్ లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది. మొత్తంగా.. ‘మిరాయ్‘ రెండు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.55.60 కోట్లు సాధించినట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ పీపలు్ మీడియా ఫ్యాక్టరీ.