నివీన్ పాలీ కొత్త చిత్రం ప్రారంభం

నివిన్ తాజాగా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఉన్నికృష్ణన్ సోషల్ మీడియాలో నివిన్ సెట్స్‌లో మొదటి రోజు ఫోటోలను షేర్ చేశాడు. ఇది వీరిద్దరి మొదటి కాంబో మూూవీ.;

By :  K R K
Update: 2025-09-14 12:36 GMT

మలయాళ యంగ్ హీరో నివిన్ పౌలీ కొత్త సినిమా.. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో గురువారం తిరువనంతపురంలో పూజా కార్యక్రమంతో మొదలైంది. నివిన్ తాజాగా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఉన్నికృష్ణన్ సోషల్ మీడియాలో నివిన్ సెట్స్‌లో మొదటి రోజు ఫోటోలను షేర్ చేశాడు. ఇది వీరిద్దరి మొదటి కాంబో మూూవీ. ఇది ఒక పొలిటికల్ డ్రామాగా రూపొందనుంది. వెటరన్ నటుడు-దర్శకుడు బాలచంద్ర మీనన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా కథ, సహాయ నటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

గోకులం గోపాలన్ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ ఈ ఇంకా టైటిల్ ప్రకటించని చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉన్నికృష్ణన్ ‘మదంబి, గ్రాండ్‌మాస్టర్, విలన్, ఆరాట్టు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించినవాడు. అతడి చివరి చిత్రం 2023లో మమ్ముట్టి నటించిన ‘క్రిస్టోఫర్’. నివిన్ చివరిగా 2024లో డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వచ్చిన ‘మలయాళీ ఫ్రం ఇండియా’ సినిమాలో కనిపించాడు.

నివీన్ పాలీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘పాచువుం అత్భుత విళక్కుం’ ఫేమ్ అఖిల్ సత్యన్ దర్శకత్వంలో ‘సర్వం మాయ’ , గరుడన్ ఫేమ్ అరుణ్ వర్మ దర్శకత్వంలో ‘బేబీ గాళ్’, ఎల్‌సీయూలో భాగమైన తమిళ చిత్రం ‘బెంజ్’ వంటి సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే, సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ రాయ్ దర్శకత్వంలో నయనతారతో కలిసి నటిస్తున్న ‘డియర్ స్టూడెంట్స్’, తమిళ చిత్రం ‘ఏళు కడల్ ఏళు మలై’ , పీఆర్ అరుణ్ దర్శకత్వంలో నివిన్ వెబ్ సిరీస్ డెబ్యూ ఫార్మా కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి.

Tags:    

Similar News