ఇప్పుడు దక్షిణాది క్రేజీ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్

రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన “లోకః: చాప్టర్ 1 చంద్ర” తో జాక్‌పాట్ కొట్టేసింది. ఈ మూవీ కేరళలో బ్లాక్‌బస్టర్ అయ్యి.. బయట కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.;

By :  K R K
Update: 2025-09-11 07:42 GMT

ఫేమస్ మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్, నిన్నటి తరం హీరోయిన్ లిజీల కూతురైన కల్యాణి ప్రియదర్శన్ తన యాక్టింగ్ కెరీర్‌ను తెలుగు సినిమాలతో కిక్‌స్టార్ట్ చేసింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన “హలో” మూవీలో అఖిల్ అక్కినేనితో డెబ్యూ చేసింది. కానీ, అది పెద్దగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ “చిత్రలహరి” అనే మరో మూవీ మాత్రమే చేసింది. ఆ తర్వాత.. కల్యాణి తన మదర్ వుడ్ మాలీవుడ్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది.

ఎనిమిది మలయాళం మూవీస్ చేసిన తర్వాత .. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన “లోకః: చాప్టర్ 1 చంద్ర” తో జాక్‌పాట్ కొట్టేసింది. ఈ మూవీ కేరళలో బ్లాక్‌బస్టర్ అయ్యి.. బయట కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగులో “కొత్త లోక” గా రిలీజై ఆంధ్ర, తెలంగాణలో మంచి వసూళ్లు రాబట్టింది.

అయితే... మలయాళం వెర్షన్ మాత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి, టాప్ మలయాళం గ్రాసర్స్‌లో చోటు సంపాదించింది. ఈ మెగా హిట్‌తో, 32 ఏళ్ల కల్యాణి ఒక్కసారిగా స్టార్‌డమ్ లెవెల్‌కు చేరింది. సినిమాలో ఫీమేల్ సూపర్‌హీరో రోల్‌లో ఆమె చేసిన పెర్ఫార్మన్స్, ఆమెను నెక్స్ట్ ఫీమేల్ సూపర్‌స్టార్‌గా మార్చేసింది. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్స్ ఆమె డోర్ తట్టే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News