కార్తీ క్లాప్ తో విశాల్ కొత్త సినిమా
‘మద గజ రాజా’ వంటి హిట్ తర్వాత విశాల్ ఇప్పుడు కొత్త సినిమాని షురూ చేశాడు. విశాల్ 35 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.;
By : S D R
Update: 2025-07-14 07:55 GMT
‘మద గజ రాజా’ వంటి హిట్ తర్వాత విశాల్ ఇప్పుడు కొత్త సినిమాని షురూ చేశాడు. విశాల్ 35 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సీనియర్ నిర్మాత ఆర్.బి. చౌదరి నేతృత్వంలో రూపొందుతున్న 99వ చిత్రం ఇది కావడం విశేషం.
ఈ చిత్రానికి ‘ఈటి, అయ్యంగరన్’ ఫేమ్ రవి ఆరాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ముహూర్తాన్ని జరుపుకున్న విశాల్ 35 చిత్రానికి హీరో కార్తి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం చెన్నైలో ఈ చిత్రానికి సంబంధించి 45 రోజుల పాటు జరిగే షెడ్యూల్ షురూ అయ్యింది.