‘కింగ్డమ్’ సెకండ్ సింగిల్ అప్డేట్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.;

By :  S D R
Update: 2025-07-14 08:15 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, యూత్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌ ‘హృదయం లోపల’ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్‌ను షేర్ చేశారు మేకర్స్. ‘అన్న అంటేనే..’ అనే ఎమోషనల్ సాంగ్‌ను జూలై 15న సాయంత్రం 5:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ పాట అన్నా-తమ్ముల అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా చూపించనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్న పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌లో చిన్నతనంలో అన్నదమ్ములు కలిసి ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. జూలై 31న ‘కింగ్డమ్‘ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags:    

Similar News