బి. సరోజా దేవి మృతి పట్ల బాలకృష్ణ సంతాపం
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒకదశలో ధ్రువతారలా వెలుగొందిన ప్రముఖ నటి, పద్మభూషణ్ బి. సరోజా దేవి గారి మరణం అత్యంత బాధాకరమని నందమూరి బాలకృష్ణ తెలిపారు.;
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒకదశలో ధ్రువతారలా వెలుగొందిన ప్రముఖ నటి, పద్మభూషణ్ బి. సరోజా దేవి గారి మరణం అత్యంత బాధాకరమని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలుగులో ఎన్టీఆర్ గారితో, తమిళంలో ఎంజీఆర్ గారితో, కన్నడంలో డాక్టర్ రాజ్‌కుమార్ గారితో ఏకకాలంలో హిట్ జోడీగా ఆమె గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
‘మా తండ్రి ఎన్టీఆర్ గారితో సరోజా దేవి గారు దాదాపు రెండు దశాబ్దాల పాటు 20కి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. శ్రీరాముడి పక్కన సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగా నటించిన విశిష్టత ఆమె సొంతం‘ అని బాలకృష్ణ గుర్తుచేశారు.
ఆమె వెండితెరపై కూడా, నిజ జీవితంలోనూ అందించిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ‘ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను‘ అని బాలకృష్ణ అన్నారు.