కేరళ అమ్మాయి, ఢిల్లీ అబ్బాయి లవ్ స్టోరీ
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పరమ్ సుందరి‘. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్ నిర్మించారు.;
By : S D R
Update: 2025-08-12 12:09 GMT
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పరమ్ సుందరి‘. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్ నిర్మించారు. ఆగస్టు 29న విడుదలకానున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. ఈ సినిమాలో కేరళ యువతి సుందరిగా జాన్వీ కపూర్, ఢిల్లీ యువకుడు పరమ్ గా సిద్ధార్థ్ కనిపిస్తున్నారు.
సౌత్ ఇండియన్ అమ్మాయి, నార్త్ ఇండియన్ అబ్బాయి మధ్య ప్రేమకథ, వారి సంస్కృతి సాంప్రదాయాలను మేళవించి తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కేరళ అందాలు ఆకట్టుకుంటున్నాయి. సిద్ధార్థ్–జాన్వీ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మొత్తంగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ తో ‘పరమ్ సుందరి‘పై అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.