'జైలర్ 2' అనౌన్స్‌మెంట్ టీజర్ అదుర్స్‌!

Update: 2025-01-15 06:42 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్’ చిత్రం సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. రజినీ స్టైల్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కి నెల్సన్ డైరెక్షన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కలగలసి 'జైలర్' బ్లాక్ బస్టర్ సాధించింది. 'జైలర్' సినిమా వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.


Full View


'జైలర్' సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రానికి అప్పుడే సీక్వెల్ అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా 'జైలర్ 2'కి సంబంధించి పనులు వేగవంతం అయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి అనౌన్స్‌మెంట్ టీజర్ ను రిలీజ్ చేశారు.

టీజర్‌లో రజినీకాంత్ మాస్ ఎలివేషన్స్, అనిరుధ్ సిగ్నేచర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సెట్స్‌పైకి వెళ్లకుండానే విడుదలైన ఈ 4 నిమిషాల టీజర్‌లో రజనీ వయలెంట్ యాక్షన్, గూండాలతో తలపడి, వార్ ట్యాంక్స్ మధ్య నడుస్తూ కనిపించడం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

‘జైలర్ 2’ కథ, మొదటి భాగం క్లైమాక్స్‌కి కొనసాగింపుగా ఉండనుందని తెలుస్తోంది. ముత్తువేల్ పాండియన్ పాత్రను మరింత శక్తివంతంగా చూపించనున్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి బరిలో రానుందనే ప్రచారం జరుగుతుంది.

Similar News