హైప్ పెంచేస్తోన్న ‘అఖండ 2‘
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ ‘అఖండ 2‘ మూవీ ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే ఓటీటీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది.;
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ ‘అఖండ 2‘ మూవీ ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే ఓటీటీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు టాక్.
ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న కొద్ది మంది స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఇంత స్థాయి ధర దక్కింది. ఇప్పుడు బాలయ్య క్రేజ్‌తో పాటు బోయపాటి శ్రీనుకాంబినేషన్‌కు ఉన్న ప్రత్యేక ఆకర్షణ కారణంగా ఈ రికార్డ్ స్థాయి డీల్ కుదిరిందని చెబుతున్నారు.
అసలు దసరా కానుకగా రావాల్సిన ‘అఖండ 2‘ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్. మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అఖండ 2‘కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి.
‘అఖండ‘కి అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన తమన్.. ఇప్పుడు సీక్వెల్ లో అంతకు మించి అన్నట్టుగా కంపోజ్ చేస్తున్నాడట. ‘అఖండ 2‘లోని ఇంటర్వెల్ బ్లాక్ అదుర్స్ అంటూ ఓ ట్వీట్ చేశాడు తమన్. తన స్టూడియోకి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి వచ్చిన ఫోటోని షేర్ చేసి.. ‘అఖండ 2‘ ఆడియోపై హైప్ పెంచేశాడు.