‘కాంచన 4’ రెడీ అవుతోంది !

‘కాంచన 4’ నిర్మాణంలో ఉంది. తాజా అప్‌డేట్ ప్రకారం షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. కానీ టీమ్ లక్ష్యం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ముగించడం.;

By :  K R K
Update: 2025-09-12 09:45 GMT

కోలీవుడ్ సూపర్ హిట్ హారర్ ఫ్రాంచైజ్ ‘కాంచన’. ఈ హారర్ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాయి. మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, ‘కాంచన 3’ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసి, తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకు గట్టి పోటీనిచ్చింది.

ఇప్పుడు నాల్గవ భాగం ‘కాంచన 4’ నిర్మాణంలో ఉంది. తాజా అప్‌డేట్ ప్రకారం షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. కానీ టీమ్ లక్ష్యం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ముగించడం.

రాఘవ లారెన్స్ ఈ సినిమాకు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఈ హారర్ మూవీతో కోలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. రిపోర్ట్స్ ప్రకారం, పూజా హెగ్డే అండ్ రష్మిక మందన్న కూడా తారాగణంలో భాగమని తెలుస్తోంది. అయితే వారి పాత్రలపై అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది.

Tags:    

Similar News