‘మిరాయ్‘కి కలిసొచ్చిన ప్రభాస్

ఒక సినిమా విజయానికి కేవలం కథ, నటన మాత్రమే కాదు.. స్టార్ పవర్ కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. కొన్నిసార్లు గెస్ట్ రోల్‌లోనైనా, వాయిస్ ఓవర్ రూపంలోనైనా ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇస్తే, ఆ సినిమాకు అదనపు క్రేజ్ వస్తుంది.;

By :  S D R
Update: 2025-09-12 08:47 GMT

ఒక సినిమా విజయానికి కేవలం కథ, నటన మాత్రమే కాదు.. స్టార్ పవర్ కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. కొన్నిసార్లు గెస్ట్ రోల్‌లోనైనా, వాయిస్ ఓవర్ రూపంలోనైనా ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇస్తే, ఆ సినిమాకు అదనపు క్రేజ్ వస్తుంది. దీనికి లేటెస్ట్ గా ఎగ్జాంఫుల్ ‘మిరాయ్‘.

‘మిరాయ్‘ సినిమా మొదలవ్వడమే రెబెల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. గతంలో విష్ణు నటించిన ‘కన్నప్ప‘లో అతిథి పాత్రలో అదరగొట్టాడు ప్రభాస్. రెబెల్ స్టార్ పవర్ ‘కన్నప్ప‘కి ఓ రేంజులో వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ‘మిరాయ్‘కి కూడా ప్రభాస్ తన సపోర్ట్ అందించడంతో ఈ సినిమాకి అదనపు బలం కలిసినట్టయ్యింది.

ఇప్పటికే ‘మిరాయ్‘ సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫస్ట్ షో నుంచే అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ రెస్పాన్స్ దక్కుతుంది. టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో గంటకు 15 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతూ సూపర్ డూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది ‘మిరాయ్‘.

Tags:    

Similar News