కలిసి స్టెప్పులేసిన ధనుష్, ప్రభుదేవా.. ట్రెండిగ్ అవుతోన్న వీడియో

Update: 2025-02-23 10:20 GMT

కలిసి స్టెప్పులేసిన ధనుష్, ప్రభుదేవా.. ట్రెండిగ్ అవుతోన్న వీడియోప్రముఖ కోలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, హీరో కమ్ డైరెక్టర్ ప్రభుదేవా వైబ్ లైవ్ డాన్స్ కాన్సెర్ట్ తాజాగా చెన్నైలో అద్భుతంగా ముగిసింది. తన ఎనర్జిటిక్ డాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ప్రభుదేవా.. ఇతర ప్రముఖులతో కలిసి స్టేజ్‌పై సందడి చేశాడు. ఈ ఈవెంట్‌లో స్టార్ హీరో ధనుష్, ఎస్‌.జె.సూర్య, వడివేలు వంటి సినీ ప్రముఖులు కూడా పాల్గొని తమ ప్రదర్శనలతో అభిమానులను అలరించారు.

ప్రస్తుతం ఈ కన్సర్ట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా "మారి 2" చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్‌కు ధనుష్, ప్రభుదేవా కలిసి స్టేజ్‌పై డాన్స్ చేసిన వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో, హోస్ట్ ధనుష్‌ను స్టేజ్‌పై ఆహ్వానించగా.. ప్రభుదేవా మొదట డాన్స్ చేస్తాడు. అతని స్టెప్స్‌కు ధనుష్ వెంటనే జతకట్టాడు. అభిమానులు ఆనందంతో అరుపులు, కేరింతలు కొడుతూ సందడి చేశారు.

ఇంకొక వీడియోలో, ప్రభుదేవా తన ప్రదర్శనలో భాగంగా ఎస్‌.జె.సూర్య, వడివేలులతో కలిసి స్టెప్పులేశాడు. తమ కమెడీ టైమింగ్‌కి ప్రసిద్ధులైన వీరిద్దరూ స్టేజ్‌పై ప్రభుదేవా ఎనర్జీకి తగ్గట్టుగా స్టెప్పులేస్తూ అభిమానులను నవ్వుల జల్లు కురిపించారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో 100 మందికి పైగా డాన్సర్లు, అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. హరి హరన్ కన్సెప్ట్‌ను రూపొందించగా, అరుణ్ ఈవెంట్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

Tags:    

Similar News