'రెట్రో' నుంచి 'బుజ్జమ్మ' సాంగ్!

సూర్య, పూజా హెగ్డే జంటగా రాబోతున్న మూవీ 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.;

By :  S D R
Update: 2025-03-28 13:18 GMT

సూర్య, పూజా హెగ్డే జంటగా రాబోతున్న మూవీ 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, 'కన్నుల్లోనా' అంటూ సాగే ఎమోషనల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి రెట్రో స్టైల్ లో సాగే 'బుజ్జమ్మ' పాట విడుదలైంది.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తో రాబోతున్న ఈ మూవీలో ఓ పెళ్లి నేపథ్యంలో సూర్య, పూజా హెగ్డే సందడి చేసే 'బుజ్జమ్మ' పాట ఆకట్టుకుంటుంది. ఆద్యంతం రెట్రో స్టైల్ లో ఎయిటీస్ తరహా స్టెప్పులతో ఈ పాట బాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్నందించి ఈ పాటను పాడటం విశేషం. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న రాబోతుంది.



Full View


Tags:    

Similar News