‘వార్ 2’ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ !

గత సంవత్సరం ప్రారంభమైన ‘వార్ 2’ చిత్రం షూటింగ్ లేటెస్ట్ గా అధికారికంగా పూర్తి అయ్యిందని టాక్. చివరి షెడ్యూల్ ను యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరించారని తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-01-28 01:02 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు కమిట్ అయ్యాడు. ఒకటి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కాగా, మరొకటి బాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ‘వార్ 2’ . ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్  మల్టీ స్టారర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

గత సంవత్సరం ప్రారంభమైన ‘వార్ 2’ చిత్రం షూటింగ్ లేటెస్ట్ గా అధికారికంగా పూర్తి అయ్యిందని టాక్. చివరి షెడ్యూల్ ను యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరించారని తెలుస్తోంది. ఇందులో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. షూటింగ్ ముగియడంతో అభిమానుల కళ్లంతా ఈ సినిమాపైనే పడ్డాయి.

‘వార్ 2’ చిత్రం దృశ్యపరంగా ఓ అద్భుత చిత్రంగా ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి స్క్రీన్‌ను షేర్ చేయడమే కాకుండా, వీరిద్దరి మధ్య ప్రత్యేక డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రానికి హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ‘వార్ 2’ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలవుతోంటే.. అభిమానులూ, సినిమా ప్రేమికులూ ఈ ఇద్దరు స్టార్ హీరోల డైనమిక్ కెమిస్ట్రీని తెరపై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News