ఇటు ప్రభాస్ .. అటు రణవీర్ .. మధ్యలో షాహిద్ !
విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న టైటిల్ లేని ప్రాజెక్ట్ ఆ రోజు విడుదల కాకుండా.. బహుశా 2026 జనవరి రెండో శుక్రవారానికి వాయిదా పడవచ్చనే ఊహాగానాలు షురూ అయ్యాయి.;
రణవీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా అతని మోస్ట్ అవైటింగ్ చిత్రం ‘ధురంధర్’ డిసెంబర్ 5న విడుదల కానుందని ఫస్ట్-లుక్ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటనకు ఒక వారం ముందు, ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం కూడా అదే డిసెంబర్ 5న విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో.. షాహిద్ కపూర్ నటిస్తున్న.. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న టైటిల్ లేని ప్రాజెక్ట్ ఆ రోజు విడుదల కాకుండా.. బహుశా 2026 జనవరి రెండో శుక్రవారానికి వాయిదా పడవచ్చనే ఊహాగానాలు షురూ అయ్యాయి.
అయితే, తాజా నివేదిక ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నిర్మాతలు అలాంటి ప్లాన్ ఏదీ లేదని, డిసెంబర్ 5 విడుదల తేదీనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు .ఒక సోర్స్ చెప్పిన ప్రకారం.. షాహిద్ కపూర్ తదుపరి చిత్రం కోసం డిసెంబర్ 5 తేదీని ముందుగా బుక్ చేసింది ఈ ప్రాజెక్ట్ టీమే. షూటింగ్ స్టెడీగా సాగుతోంది, చిత్రం అద్భుతంగా వస్తోంది... అని నిర్మాత సాజిద్ నడియాద్‌వాలా తన సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి ఈ తేదీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాడు.
సాజిద్ నడియాద్‌వాలా డిసెంబర్ 5 తేదీని వదులుకోకూడదని నిర్ణయించడం, అతని సినిమాపై ఉన్న బలమైన విశ్వాసాన్ని చూపిస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌తో పాటు త్రిప్తి దిమ్రీ, నానా పటేకర్, రణదీప్ హుడా లాంటి ఆసక్తికరమైన తారాగణం ఉంది. విశాల్ భరద్వాజ్ ట్రేడ్‌మార్క్ స్టైల్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, ఇది బిగ్ స్క్రీన్‌పై చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది. అంతేకాక, విశాల్ భరద్వాజ్ సినిమా కాబట్టి.. ఓ స్పెషల్ వాచ్‌గా మార్చబోతోంది చిత్రం. మొత్తానికి ఈ డిసెంబర్‌లో మూడు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటం ఏం జరుగుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.