చివరిదశ షూటింగ్ లో ‘బోర్డర్ 2’ మూవీ
ఈ ఇద్దరు నటులు ఫ్లైట్‌లో క్లైమాక్స్ షూట్ కోసం వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. "లాస్ట్ బ్యాటిల్ లోడింగ్..." అనే క్యాప్షన్‌తో ఈ వీడియో, తీవ్రమైన యుద్ధ సీక్వెన్స్ రూపొందుతోందని సూచిస్తోంది.;
వరుణ్ ధావన్, అహాన్ శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైంటింగ్ వార్ డ్రామా 'బోర్డర్ 2'. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఫిల్మ్ కో-ప్రొడ్యూసర్ బినోయ్ గాంధీ షేర్ చేసిన ఓ వీడియోలో.. ఈ ఇద్దరు నటులు ఫ్లైట్‌లో క్లైమాక్స్ షూట్ కోసం వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. "లాస్ట్ బ్యాటిల్ లోడింగ్..." అనే క్యాప్షన్‌తో ఈ వీడియో, తీవ్రమైన యుద్ధ సీక్వెన్స్ రూపొందుతోందని సూచిస్తోంది. ఆ తర్వాత, అమృత్ సర్ రోడ్లపై కారులో నుంచి షేర్ చేసిన మరో వీడియో, షూటింగ్ పంజాబ్‌లోని అమృత్సర్‌లో జరుగుతోందని తెలిపింది.
ఈ స్నీక్ పీక్, 'బోర్డర్ 2' చిత్రీకరణలో వరుణ్ ధావన్, అహాన్ శెట్టిల మధ్య బలమైన స్నేహ బంధాన్ని, టీమ్ స్ఫూర్తిని హైలైట్ చేస్తుంది. ఈ రకమైన చిన్న చిన్న దృశ్యాలు అభిమానులకు సినిమా వెనుక జరిగే ఆసక్తికరమైన క్షణాలను చూపిస్తాయి. ఈ నెల ప్రారంభంలో.. 'బోర్డర్ 2' మూడవ షెడ్యూల్ పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో హై-ఎనర్జీ క్యాడెట్ సాంగ్‌తో షూట్ చేశారు. దిల్జీత్ దోసాంఝ్, అహాన్ శెట్టి, వరుణ్ ధవన్, సన్నీ డియోల్ లాంటి ప్రధాన తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది.
సన్నీ డియోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గ్రూప్ ఫోటో షేర్ చేస్తూ.. "అన్ని ‘ఫోర్సెస్’ ఒక్కటైనప్పుడు. దిల్జీత్ దోసాంఝ్, అహాన్ శెట్టి, సన్నీ డియోల్, వరుణ్ ధవన్‌తో కలిసి పూణే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడవ షెడ్యూల్ స్టార్ట్..." అని రాశారు. 'బోర్డర్ 2' చిత్రాన్ని గుల్షన్ కుమార్, టీ-సిరీస్, జె.పి. దత్తా జె.పి. ఫిల్మ్స్‌తో కలిసి ప్రజెంట్ చేస్తోంది. 1997లో వచ్చిన 'బోర్డర్' సీక్వెల్‌గా, ఈ చిత్రం భారతీయ సైనికుల వీరత్వం, అచంచలమైన స్ఫూర్తిని గౌరవిస్తూ, పెట్రియాటిజం, ధైర్యం, త్యాగాల గొప్ప జర్నీని ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ భారీ పెట్రియాటిక్ సాగా 'బోర్డర్ 2' జనవరి 23, 2026న థియేటర్లలోకి రానుంది.