‘డాన్ 3’ కోసం ఆ సాంగ్ ను రీక్రియేట్ చేస్తారట!

ఈ పాట కోసం కృతి, రణ్‌వీర్‌లతో కలిసి నటించే మరో నటిని ఎంపిక చేసే పనిలో టీమ్ ఉందట.;

By :  K R K
Update: 2025-07-25 02:50 GMT

సోషల్ మీడియాలో ఇప్పుడు ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డాన్ 3’ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్‌గా నటించనుందని టాక్. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కృతి సనన్ ఫర్హాన్ ఎక్సెల్ ఆఫీస్‌లో కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కృతి సనన్ ‘డాన్ 2’ లోని ఆజ్ కీ రాత్ లాంటి హై-ఎనర్జీ సాంగ్‌లో నటించనుందట.

‘డాన్ 2’ లో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, ఈషా కొప్పికర్‌లతో ఈ పాట సూపర్ హిట్ అయింది. ఈ కొత్త పాట కూడా అదే వైబ్‌తో ఉంటుందని సమాచారం, కానీ ఇంకా దీని గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. కృతి ఈ పాటలో భాగమైనప్పటికీ.. మరో నటి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. సినిమా కథ, తారాగణం గురించి చివరి వివరాలు కూడా వెల్లడి కాలేదు. ఈ పాట కోసం కృతి, రణ్‌వీర్‌లతో కలిసి నటించే మరో నటిని ఎంపిక చేసే పనిలో టీమ్ ఉందట. అయితే.. ఫర్హాన్ అఖ్తర్ లేదా ఎక్సెల్ టీమ్ ఇంకా ఈ విషయంపై స్పందించలేదు.

రణ్‌వీర్, కృతి కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో కృతి సనన్ మిమీ చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన స్పీచ్‌లో రణ్‌వీర్‌ను ఉటంకిస్తూ.. “నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, నీ ఇంటిపేరు ఏమైనా, కాంటాక్ట్స్ ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు. ప్రయాణం కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు, కానీ నీపై నీకు నమ్మకం ఉంటే, కష్టపడితే, నువ్వు అక్కడికి చేరుకుంటావు. అది నీ ప్రయాణం. అని చెప్పింది.

Tags:    

Similar News