అదరగొట్టేస్తున్న ‘వార్ 2‘ ట్రైలర్!

Update: 2025-07-25 05:38 GMT

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2‘. ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతుండటం విశేషం. కియారా అద్వానీ కథానాయిక. ఇప్పటికే సూపర్ హిట్టైన ‘వార్‘కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. అయన్ ముఖర్జీ డైరెక్షన్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రైలర్ వచ్చేసింది.

Full View

తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లో రిలీజైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హృతిక్ – ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు, మాస్ డైలాగులు, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం తెలుగు హక్కులను సితార అధినేత నాగవంశీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14న ‘వార్ 2‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News