థియేటర్లలో వీరమల్లు కొత్త వెర్షన్!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ విడుదలైంది. జూలై 23 నుంచే ప్రీమియర్ షోస్ తో మొదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.70 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.;

By :  S D R
Update: 2025-07-26 02:11 GMT

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ విడుదలైంది. జూలై 23 నుంచే ప్రీమియర్ షోస్ తో మొదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.70 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొదట దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అనంతరం జ్యోతి కృష్ణ పూర్తిచేయడం వల్ల కథనంపై ప్రభావం పడిందన్న అభిప్రాయాలు వినిపించాయి.

పవన్ కళ్యాణ్ ఎంట్రీ, 'కొల్లగొట్టినాదిరో' పాట, పోర్ట్ ఫైట్, చార్మినార్ ఫైర్ సీన్‌లకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో కథనం సాగదీతగా అనిపించడం, వీఎఫ్‌ఎక్స్ బలహీనత, పవన్ లుక్స్ కొన్ని చోట్ల సింక్ కాకపోవడం మైనస్ గా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో, హార్స్ రైడింగ్, తోడేలు, కోహినూర్ వజ్రం వంటి సన్నివేశాలను మూవీ టీమ్ తొలగించినట్టు తెలు్సతోంది.

దీంతో సినిమా నిడివిని 2 గంటల 42 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాలకు కుదించారట. కొత్త వెర్షన్ నిన్న రాత్రి నుంచే థియేటర్లలో ప్రదర్శించబడుతున్నట్టు టాక్. అధికారికంగా ఇంకా ప్రకటన రాకపోయినా, థియేటర్లలో కొత్త వెర్షన్నే ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News