‘డాన్ 3’ చిత్రంలో హీరోయిన్ ఎవరు?

‘ముంజియా, మహారాజ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత కోట్లాది మంది అభిమానుల మనసులు గెలిచిన అందగత్తె శార్వరినే ‘డాన్ 3’ కి కథానాయికగా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.;

By :  K R K
Update: 2025-04-16 07:12 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రణవీర్ సింగ్ ‘డాన్ 3’ చిత్రానికి తాజాగా హీరోయిన్‌ ఎంపిక అయిన విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ముంజియా, మహారాజ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత కోట్లాది మంది అభిమానుల మనసులు గెలిచిన అందగత్తె శార్వరినే ‘డాన్ 3’ కి కథానాయికగా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. యశ్ రాజ్ ఫిలింస్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా అలియా భట్‌తో కలిసి ‘అల్ఫా’ చిత్రంలో నటిస్తున్న శార్వరి ఇప్పుడు మరో బిగ్ ఫ్రాంచైజీకి జాయిన్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

కియారా అద్వానీ ‘డాన్ 3’ చిత్రానికి గుడ్‌బై చెప్పింది. తను మొదటి బిడ్డను కంటున్నట్టు ప్రకటించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె తప్పుకున్న తర్వాత చిత్ర బృందం కొత్త కథానాయిక కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పుడు శార్వరిని కథానాయికగా ఫైనల్ చేయడం విశేషంగా మారింది. శార్వరితో పాటు మరో హీరోయిన్‌ను కూడా పరిశీలించారట. కానీ శార్వరి ఈ పాత్రను గెలుచుకుంది.

డాన్ 3 షూటింగ్ 2025 చివరిలో ప్రారంభం అయ్యే అవకాశముందని బాలీవుడ్ రిపోర్ట్. అప్పటికి శార్వరి ‘అల్ఫా’ సినిమా ప్రమోషన్లు పూర్తి చేస్తుందట. అదే సమయంలో రణవీర్ , ఆదిత్య ధర్ చిత్రం షూటింగ్ కూడా ముగిసిపోతుంది. ఇక ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘120 బహదూర్’ నవంబర్ 21న విడుదల కానుండగా... ఇందులో ప్రతినాయకుడిగా కనిపించే విక్రాంత్ మస్సే ఇతర ప్రాజెక్టులన్నీ అప్పటికే పూర్తి చేసుకుంటాడట.

షారుఖ్ ఖాన్ – ఫర్హాన్ అఖ్తర్ కలయికలో వచ్చిన అద్భుత యాక్షన్ మూవీ డాన్. మొదటి భాగం 2006లో విడుదలై సూపర్ హిట్ కాగా, 2011లో వచ్చిన డాన్ 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ ఫ్రాంచైజీలో ప్రియాంకా చోప్రా కూడా భాగమై ఉండేది. అయితే 2023 ఆగస్టులో అధికారికంగా రణవీర్ సింగ్‌ డాన్ 3కి హీరోగా ఎంపిక అయినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు శార్వరి లాంటి యువ, టాలెంటెడ్ నటిని హీరోయిన్‌గా తీసుకోవడం, ఫ్రాంచైజీకి కొత్త ఊపిరి పోసే అవకాశంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News