ఓటీటీలోకి రాబోతున్న ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’

ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సమయం ఆసన్నమైంది. ఈ సూపర్ యాక్షన్ మూవీ ఓటీటీలో ఆగస్టు 19, 2025న స్ట్రీమింగ్ కు రెడీ కాబోతోంది.;

By :  K R K
Update: 2025-07-24 10:26 GMT

టామ్ క్రూజ్ ఐకానిక్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ 7 సక్సెస్ ఫుల్ మూవీస్ వచ్చాయి. ఈ ఏడాది ఈ ఫ్రాంచైజీలోని 8వ సినిమా, ఈ సీరిస్ లో ఆఖరి సినిమా ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా థియేటర్స్ లో విడుదలై.. అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సమయం ఆసన్నమైంది. ఈ సూపర్ యాక్షన్ మూవీ ఓటీటీలో ఆగస్టు 19, 2025న స్ట్రీమింగ్ కు రెడీ కాబోతోంది.

ఈ యాక్షన్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫాండాంగో ఎట్ హోమ్, ఇంకా.. యాపిల్ టీవీ+ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ చేయబోతున్నాన్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. "ప్రపంచవ్యాప్తంగా మీరు థియేటర్లలో చూశారు. ఇప్పుడు ‘మిషన్‌ఇంపాసిబుల్ - ది ఫైనల్ రెకనింగ్‌’ ని ఆగస్టు 19 నుంచి డిజిటల్‌లో ఇంట్లో చూడండి. థియేటర్లలో ఇప్పటికీ చూడొచ్చు." అని ప్రకటించారు.

ఈ హై-ఓక్టేన్ ఫినాలేలో, ఈథన్ ఒక రోగ్ ఏఐ ఆయుధాన్ని ఎదుర్కొంటాడు. అది రియాలిటీని మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచ భవిష్యత్తు ప్రమాదంలో ఉండగా, అతను ఇల్సా ఫాస్ట్ (రెబెక్కా ఫెర్గూసన్), బెంజీ డన్ (సైమన్ పెగ్), లూథర్ స్టికెల్ (వింగ్ రామ్స్) వంటి సన్నిహిత మిత్రులతో కలిసి, హేలీ ఆట్వెల్, ఈసాయ్ మోరల్స్ వంటి కొత్త ముఖాలతో కలిసి పనిచేస్తాడు. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వంలో, ఈ సినిమా అద్భుతమైన స్టంట్స్, లోతైన భావోద్వేగాలు, "ప్రపంచాన్ని రక్షించడానికి ఎంత దూరం వెళ్ళవచ్చు?" అనే ఆలోచింపజేసే ప్రశ్నను మిళితం చేస్తుంది. పారామౌంట్ పిక్చర్స్ మరియు స్కైడాన్స్ మీడియా నిర్మించిన ఈ చిత్రం సుమారు $290 మిలియన్ బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు $574 మిలియన్ (సుమారు ₹4,790 కోట్లు) వసూలు చేసింది.

Tags:    

Similar News