100 కోట్ల క్లబ్ లోకి రెండు హాలీవుడ్ చిత్రాలు !

బ్రాడ్ పిట్ నటించిన ‘ఎఫ్ 1’, ‘జురాసిక్ వరల్డ్ : రీబర్త్’ జూన్, జులై నెలల్లో థియేటర్లలో అద్భుతమైన విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు ఇండియాలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.;

By :  K R K
Update: 2025-07-24 06:42 GMT

ఈ సమ్మర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నీరసంగా ఉన్నప్పటికీ, హాలీవుడ్ సినిమాలు భారతీయ బాక్స్ ఆఫీస్‌ వద్ద సంచలనం సృష్టించాయి. బ్రాడ్ పిట్ నటించిన ‘ఎఫ్ 1’, ‘జురాసిక్ వరల్డ్ : రీబర్త్’ జూన్, జులై నెలల్లో థియేటర్లలో అద్భుతమైన విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు ఇండియాలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇది హాలీవుడ్ చిత్రాలకు ఇటీవల దక్కిన అరుదైన విజయం.

అందరూ ఎంతగానో ఎదురుచూసిన డీసీ సినిమా ‘సూపర్ మ్యాన్’ బాక్స్ ఆఫీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జూన్ 27న విడుదలైన ‘ఎఫ్ 1’ ప్రేక్షకుల నుండి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సినిమా దాదాపు నెల రోజులుగా అద్భుతంగా ఆడుతోంది. భారతదేశంలోని చాలా స్క్రీన్‌లు వీకెండ్స్‌లో ఇప్పటికీ హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. జులై 4న విడుదలైన ‘జురాసిక్ వరల్డ్ : రీబర్త్’ మూవీ.. డైనోసార్ ఫ్రాంచైజీ లెగసీ కారణంగా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది.

పిల్లలు, నాస్టాల్జిక్ అడల్ట్స్ ఈ సినిమాను ఆదరించడంతో ఇది కూడా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. జులై 12న విడుదలైన ‘సూపర్ మ్యాన్’ మాత్రం మిక్స్‌డ్ టాక్‌తో ఆరంభమై, రెండు వారాల్లో రూ. 55-60 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ వారం మార్వెల్ స్టూడియోస్ ఫంటాస్టిక్ 4విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ‘ఎఫ్ 1, జురాసిక్ వరల్డ్’ చిత్రాల ఆధిపత్యాన్ని అడ్డుకోగలదా అనేది చూడాలి.

Tags:    

Similar News