రూ.100 కోట్ల ఇంట్లోకి దీపికా పదుకొనే

ఇది ఒక హైరైజ్ బిల్డింగ్ టాప్ నాలుగు అంతస్థుల పొడవునా విస్తరించి ఉంది. దాదాపు 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఇంటికి ఇంటీరియర్ పనులు పూర్తయ్యాయి.;

By :  K R K
Update: 2025-04-17 00:23 GMT

దీపికా పదుకునే, రణవీర్ సింగ్ బాలీవుడ్ సెలబ్రిటీ జంట.. రూ.100 కోట్లు విలువ చేసే క్వాడ్రప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ సొంతం చేసుకున్నారు. తమ తొలి సంతానం పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నారు. బాంద్రాలో సముద్రతీరాన ఉన్న ఈ విలాసవంతమైన క్వాడ్రప్లెక్స్, షారుక్ ఖాన్ నివాసమైన మన్నత్ సమీపంలో ఉంది.

ఇది ఒక హైరైజ్ బిల్డింగ్ టాప్ నాలుగు అంతస్థుల పొడవునా విస్తరించి ఉంది. దాదాపు 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఇంటికి ఇంటీరియర్ పనులు పూర్తయ్యాయి. ముంబయిలో దీపిక పదుకునేకు ఇప్పటికే పలు ప్రాపర్టీలు ఉన్నా, ఈ ఇంటిని ఆమె భర్త రణవీర్‌తో కలిసి శాశ్వత నివాసంగా మార్చుకుంటున్నారు. తమ బిడ్డ జన్మించాక ఒక కొత్త, అందమైన ఇంట్లో జీవితం ప్రారంభించాలని ఈ జంట కోరుకుంది.

వృత్తిపరంగా చూస్తే, దీపిక పదుకునే షారుక్ ఖాన్ కొత్త సినిమాలో కథానాయికగా నటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఆమె "కల్కి 2" చిత్రంలోనూ తన పాత్రను మళ్లీ పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. పఠాన్ 2 లోనూ దీపికా పదుకొనే తన పాత్రను కంటిన్యూ చేయబోతోందని సమాచారం.

Tags:    

Similar News