ఈ ఇద్దరిపై గుసగుసలు గుప్పుమంటున్నాయి !
అతడు శ్రీలీల వైపు ప్రేమగా చూస్తుండగా.. ఆమె తలదించుకుని మరింత పొగడ్తలు కురిపించేలా కనిపించింది. వీరు ఇద్దరూ డార్జిలింగ్‌లోని అద్భుతమైన టీ తోటల్లో ఉన్న ఒక బెంచ్‌పై కూర్చొని ఉన్నారు.;
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఆయనకు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ఆఫ్-స్క్రీన్ రొమాన్స్ గురించి పుకార్లు గుప్పు మంటున్నాయి. ఈ ప్రచారం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేలా కార్తిక్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా.. కార్తిక్ ఆర్యన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ స్టిల్‌ను షేర్ చేశాడు. అందులో అతడు శ్రీలీల వైపు ప్రేమగా చూస్తుండగా.. ఆమె తలదించుకుని మరింత పొగడ్తలు కురిపించేలా కనిపించింది. వీరు ఇద్దరూ డార్జిలింగ్‌లోని అద్భుతమైన టీ తోటల్లో ఉన్న ఒక బెంచ్‌పై కూర్చొని ఉన్నారు.
ఈ ఫొటోకి కార్తిక్ "తూ మేరీ జిందగీ హై" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది సినిమా స్టిల్ అని ఆయన స్పష్టంగా చెప్పలేదు. దీంతో వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందా? లేక ఇది కేవలం సినిమాకు పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? అనే చర్చలు నెట్టింట జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం వీరి సంబంధం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నా.. ఈ ఫొటో వారి రాబోయే చిత్రానికి సంబంధించినదేనని స్పష్టమవుతోంది. నిజంగా వీరి ప్రేమా? లేక సినిమా ప్రమోషన్ మాత్రమేనా? అనేది చూడాలి.