బాలీవుడ్‌లో హిపోక్రసీ? సందీప్ మళ్ళీ మంట పెట్టాడు!

Update: 2025-02-27 04:27 GMT

‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ, ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్‌లోనూ బడా హిట్ అందుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా రూపొందిన 'కబీర్ సింగ్' పురుషాధిక్యతను గ్లోరిఫై చేసిందని బాలీవుడ్ లో విమర్శలు వచ్చాయి. బీటౌన్ లో గతంలో ఇలాంటి అంశాలతో ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రత్యేకంగా ‘కబీర్ సింగ్’ను టార్గెట్ చేయడాన్ని సందీప్ ద్వంద్వ వైఖరిగా అభివర్ణించాడు.


Full View


ఆ తర్వాత ‘యానిమల్’ విషయంలోనూ అదే జరిగింది. సినిమా విమర్శలపాలైనా, హీరో రణబీర్ కపూర్‌ను ప్రశంసించడం హిపోక్రసీ కాదా? అని సందీప్ ప్రశ్నించాడు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి సందీప్ మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

‘కబీర్ సింగ్’లో నటించినందుకే ఓ నటుడికి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో ఛాన్స్ రాకపోవడం బాలీవుడ్ లోని కొంతమంది తీరును బట్టబయలు చేస్తుందని సందీప్ అన్నాడు. ఇంటర్వ్యూ ప్రోమోతోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశాలు, పూర్తి ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం రివీల్ అవుతాయో అన్న చర్చ ఇప్పుడు బాలీవుడ్ లో జోరుగా నడుస్తోంది

Tags:    

Similar News