‘సికందర్’ లుక్ నుంచి బైటికొచ్చిన సల్మాన్ ఖాన్

ఈ హీరో సినిమా కోసం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల.. ముంబైలోని ఓ డబ్బింగ్ స్టూడియో నుండి బయటకు వచ్చినప్పుడు, ఆయన క్లీన్-షేవ్ లుక్‌లో కనిపించాడు.;

By :  K R K
Update: 2025-03-17 01:36 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం "సికందర్" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఈ ఏడాది ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం.. ఈ హీరో సినిమా కోసం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల.. ముంబైలోని ఓ డబ్బింగ్ స్టూడియో నుండి బయటకు వచ్చినప్పుడు, ఆయన క్లీన్-షేవ్ లుక్‌లో కనిపించాడు. ఆయన ధరించిన దుస్తులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. బ్లూ అండ్ వైట్ చెక్డ్ టీ-షర్ట్, బ్లాక్ అండ్ వైట్ చెక్డ్ జాకెట్, బ్యాగీ డెనిమ్ జీన్స్, బ్లాక్ క్యాప్, స్నీకర్స్ ధరించి.. స్టైలిష్ లుక్‌తో కనిపించాడు. స్టూడియో నుండి బయటకు వస్తూ, మీడియాకు అభివాదం చేసి తన కారులోకి ఎక్కాడు.

ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు సల్మాన్ లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆయనను "మేన్ ప్యార్ కియా"లోని ప్రేమ్ లాగా కనిపిస్తున్నారని చెబుతుండగా, మరికొందరు "సల్మాన్ ఖాన్ వయసు మీద పడుతోంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ, "మా సూపర్ స్టార్ ముదురుతున్నాడు’ అని కామెంట్ చేశాడు. అయితే నెక్ట్స్ సినిమా కోసమే సల్మాన్ అలా లుక్ చేంజ్ చేశారని మరికొందరు అనుకుంటున్నారు.

ఇక ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సికందర్" చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ముంబైలో ఓ స్టూడియోలో ఓ ప్రొమోషనల్ సాంగ్ షూట్ చేశారు. ఈ పాట లతా మంగేష్కర్ ఆలపించిన లెజెండరీ సాంగ్ రీమిక్స్ అని సమాచారం. కానీ, ఆ పాట పేరును ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే ఈ సినిమా నుండి "జోహ్రా జబీన్", "బం బం భోల్" అనే రెండు పాటలు విడుదలయ్యాయి. "జోహ్రా జబీన్" పాటలో సల్మాన్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, "బం బం భోల్" అనే హోలీ సాంగ్ ఎనర్జిటిక్ బీట్స్‌తో అలరిస్తోంది.

Tags:    

Similar News