పూరి సినిమాలో మరో టాలెంటెడ్ బ్యూటీ!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇటీవల వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత (లైగర్, డబుల్ ఇస్మార్ట్) తన కెరీర్‌ను మళ్ళీ ట్రాక్ మీద పెట్టేందుకు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-04-28 09:52 GMT

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇటీవల వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత (లైగర్, డబుల్ ఇస్మార్ట్) తన కెరీర్‌ను మళ్ళీ ట్రాక్ మీద పెట్టేందుకు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ సేతుపతిని కథానాయకుడిగా తీసుకుని ఓ విభిన్నమైన సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించగా, తాజాగా ఈ ప్రాజెక్టులో యంగ్ టాలెంట్ నివేదా థామస్ కూడా చేరినట్టు తెలుస్తోంది.

నివేదా థామస్, ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి భార్య పాత్రలో కనిపించబోతోందట. ఇది కేవలం సాదారణమైన పాత్రగా కాకుండా.. పూర్తి వేరియేషన్ ఉన్న క్యారెక్టర్‌గా రూపొందించాడట పూరి. '35' మూవీ తర్వాత నివేదా తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే కానుంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా కనిపిస్తాడట. ఈనేపథ్యంలో ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మొత్తంగా.. ఈసారి డాషింగ్ డైరెక్టర్ తన గత సినిమాల్లో కనిపించిన ఫార్ములాలను పక్కనపెట్టి, పాత్రలకు డెప్త్ కల్పించేలా కొత్త రూట్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. పూరి కనెక్ట్స్ పై పూరి, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News