‘విశ్వంభర’.. ఈసారి పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్?
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే (ఆగస్టు 22) సినీ అభిమానులకు పండగ లాంటిది. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు రెండు భారీ చిత్రాల నుంచి సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని సమాచారం.;
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే (ఆగస్టు 22) సినీ అభిమానులకు పండగ లాంటిది. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు రెండు భారీ చిత్రాల నుంచి సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని సమాచారం. ఒకవైపు సోషియో-ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న 'విశ్వంభర' నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మెగా 157' టైటిల్ గ్లింప్స్ రాబోతుంది.
అయితే.. 'విశ్వంభర' నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగోలేదనే కామెంట్స్ వినిపించాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కోసం పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ ను సిద్ధం చేస్తుందట టీమ్. చిరు బర్త్‌డేకి కొత్త టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్ వశిష్ట. ఒకవేళ ఆగస్టు 22 వరకూ సీజీ వర్క్ ఫైనల్ అవుట్‌పుట్ రాకపోతే మెగాస్టార్ బర్త్‌డేకి 'విశ్వంభర' నుంచి సర్ప్రైజ్ ఉండకపోవచ్చనే న్యూస్ కూడా వినిపిస్తుంది.
ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న 'మెగా 157' నుంచి టైటిల్ గ్లింప్స్ రాబోతుంది. చిరు బర్త్‌డే స్పెషల్ గా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్‌చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని లేటెస్ట్‌గా డైరెక్టర్ అనిల్ రావిపూడా కూడా కన్ఫమ్ చేశాడు. మొత్తంగా.. మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్ గా డబుల్ ధమాకా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఎలాంటి సర్ప్రైజెస్ వస్తాయో చూడాలి.