'స్టాలిన్' రీ-రిలీజ్.. మెగాస్టార్ మెస్సేజ్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారబోతోంది. చిరు బర్త్‌డే స్పెషల్ గా 'స్టాలిన్' మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.;
By : S D R
Update: 2025-08-16 13:36 GMT
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారబోతోంది. చిరు బర్త్‌డే స్పెషల్ గా 'స్టాలిన్' మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించిన 'స్టాలిన్' చిత్రం 2006లో విడుదలైంది. చిరు మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెస్సేజ్ ఓరియెంటెడ్ గా ఈ మూవీ ఆకట్టుకుంది.
ఇప్పుడు మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్ గా ఆగస్టు 22న 'స్టాలిన్' మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా గురించి ఓ సందేశాన్ని అందించారు. మంచి సందేశంతో కూడిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిరంజీవి అన్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తే కీలక పాత్రలో ఖుష్బూ కనిపించింది. మణిశర్మ సంగీతంలోని పాటలు బాగా హిట్టయ్యాయి.