మళ్లీ పుంజుకున్న 'మహావతార్'

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. విడుదలై మూడు వారాలు దాటిన ఈ యానిమేటెడ్ మూవీ, ఇప్పుడు లాంగ్ వీకెండ్‌లో మళ్లీ విజృంభించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.;

By :  S D R
Update: 2025-08-16 03:22 GMT

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. విడుదలై మూడు వారాలు దాటిన ఈ యానిమేటెడ్ మూవీ, ఇప్పుడు లాంగ్ వీకెండ్‌లో మళ్లీ విజృంభించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ఒకవైపు ‘వార్ 2, కూలీ’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాజ్యమేలుతున్నా.. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా చూసే సినిమాగా ‘మహావతార్ నరసింహ’నే ఎంచుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలో స్క్రీన్స్ తగ్గినా 'మహావతార్' హౌస్‌ఫుల్ షోలతో నడుస్తుండటం విశేషం.

కన్నడలో రూపొందిన ఈ సినిమాను, తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ కథను డైరెక్టర్ అశ్విన్ కుమార్ అద్భుతమైన యానిమేషన్ టెక్నిక్స్‌తో రూపొందించారు. స్టార్ హీరోలు లేకుండానే, కంటెంట్ స్ట్రెంగ్త్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది.

ఇప్పటివరకు రూ.230 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం, మరో వంద కోట్లు అవలీలగా దాటేలా కనిపిస్తోంది. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వీక్షించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రం 'మహావతార్' అని చాగంటి అన్నారు.



Tags:    

Similar News